గోదావరి పుష్కరాలు 2015 ఎంతో పవిత్రమైనవి . 12సంవత్సరాలకి ఒక సారి నదికి పుష్కరాలు వస్తాయి .
అటువంటి 12 పుష్కరాలకి వచ్చే వి మహాపుష్కరాలు . అంటే ఇవి 144 సంవత్సరాలకి ఒక సారి
వస్తాయన్నమాట . 2015 జూలై లో గోదావరికి వచ్చేపుష్కరాలు అటువంటి మహా పుష్కరాలు అని
పెద్దలు చెప్పారు . అందు చేత తప్పక ఈపుష్కర స్నానం చేసి తీరాలి .
ఈ పుష్కరాలు 14జూలై 2015 నుండి 25 జూలై 2015 వరకుజరుగుతున్నాయి . ఈ పుష్కర స్నానం వలన
అశ్వమేధ యాగం చేసిన ఫలితము మరియు లక్ష గోదానాలుచేసిన ఫలితము లభించును.అందు చేత ఈ పుష్కర సమయంలో తప్పక గోదావరినదిని సందర్శించి స్నానం చేసేందుకు ఏర్పాట్లు చేసుకోండి .
గోదావరీ మాత ప్రాశస్త్యం
గోదావరి నదీ స్నానం అత్యంత పవిత్రమైనదని చెప్తారు
ఆద్యాతు గౌతమీ గంగా పశ్చాద్భాగిరధీ స్మృతా
తయోరేక తరా సేవ్యా గౌతమీ తత్ర పావనీ
ఈ గోదావరి గంగా జలాన్ని కూడా పవిత్రం చేయగలదు.అందువలననే కాశికి పోయిన వారు గంగా జలము తెచ్చి
గోదావరిలో కలుపు ఆచారము కలదు.
గోదావరి కన్న గొప్ప నదియు గోదావరి పుష్కరముల కన్నా
పుణ్య కాలము లేవు.
రేవా తీరే తపః కుర్యాత్ మరణం జాహ్నవి తటే
దానం దద్యాత్ కురుక్షేత్రే గౌతమీ మ్యాం
త్రితయం పరం
రేవా నది తీరాన తపస్సు చేస్తే ముక్తి. గంగా తీరాన మరణం ముక్తి. కురుక్షేత్రంలో దానం ముక్తి.గోదావరిలో స్నానం చేస్తే ఈ మూడు పుణ్యాలులభిస్తాయి.
పుష్యమి నక్షత్రం వున్న ఆదివారం గానీ, జన్మ తార నాడు గానీ లేదా మూడు రోజులు మూడు పూటలా
ఎవరైతే గోదావరీ స్నానం చేస్తారో వారి కులంలో కోటి మందికి ఊర్ధ్వ గతులు లభిస్తాయి.
పుష్కర విధులు
ఈ క్రింది వాటిని ప్రధానమైన పుష్కర విధులుగా
పెద్దలు చెప్పారు :
స్నానము
దానము
శ్రాద్ధము
స్నానం
పుష్కర స్నానం శుభ్రత కోసం చేసేది కాదు. ఇది దివ్యస్నానం. అందుచేత ముందుగా ఇంటి వద్ద స్నానం
చేసి శుభ్రమైన వస్త్రములు ధరించి పుష్కర స్నానానికివెళ్ళాలి. మలిన వస్త్రములతో పుష్కర స్నానం చేయరాదు.
సబ్బు షాంపూ వంటి వాటిని వాడరాదు. వంటికి నూనెరాసుకోవడం వంటివి చేయరాదు. నదిలో బట్టలు
పిండరాదు. కేవలం నదిలో మూడు మునకలు వేసిస్నానం చేయాలి తప్ప శరీర శుభ్రత కోసం కాదు.
స్నాన సంకల్పం
పుష్కర స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకొనిస్నానం చేయాలి. సంకల్పం చెప్పకుండా చేసే స్నానానికి
అంతగా ఫలితం ఉండదని చెప్తారు.పురోహితుల సహాయంతో సంకల్పం చెప్పుకొని పుష్కర స్నానం చేయటం ఉత్తమోత్తమం. ఆ
సౌలభ్యం లేని వారు ఈ క్రింది స్నాన సంకల్పంచెప్పుకొని స్నానం చేయవచ్చు.
శుక్లాం బరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే||
గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాంశ తైరపి
ముచ్యతే సర్వ పాపేభ్యో విష్ణు లోకం సగచ్ఛతి||
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర
ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహా విష్ణో
రాజ్ఞయా శ్రీ శివ శంభో రాజ్ఞయా ప్రవర్త మానస్య ఆద్య
బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత
మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే భరత
వర్షే భరత ఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య
ప్రదేశే గోదావరీ తటే అస్మిన్ వర్తమాన వ్యావహారిక
చాంద్రమానేన శ్రీ మన్మధ నామ సంవత్సరే దక్షిణాయనే
గ్రీష్మ ఋతౌ అషాఢ మాసే శుభ పక్షే శుభ తిథౌ శుభ వాసరే
శుభ నక్షత్రే శుభ యోగే శుభ కరణే ఏవం గుణ విశేషణ
విశిష్టాయాం శుభ తిథౌ శ్రీమాన్ ….గోత్రః
అహం…..నామధేయః ధర్మ పత్ని సమేతస్య
సకుటుంబ సపరివారస్య – ఉపాత్త దురితక్షయ ద్వారా
శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం
క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య
అభివృధ్యర్ధం ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ
పురుషార్థ ఫల సిధ్యర్థం,గంగా వాలుకాభి సప్తర్షి
మండల పర్యంతం కృత వారాశే పౌన్దరీకాశ్వమేధాది
సమస్త క్రతు ఫలా వాప్త్యర్ధం ఇహ జన్మని
జన్మాంతరేచ బాల్య యౌవన కౌమార వార్ధక్యేషు, జాగ్రత్
స్వప్న సుహుప్త్యవస్తాసు జ్ఞానతో జ్ఞానతస్య కామతో
కామతః స్వతః ప్రేరణతయా సంభావితానాం, సర్వేషాం
పాపానాం అపనోద నార్ధంచ- గంగా యమునాది సమస్త
పుణ్య నదీ స్నాన ఫల సిద్ద్యర్థం, కాశీ ప్రయాగాది సర్వ
పుణ్య క్షేత్ర స్నాన ఫల సిద్ద్యర్థం, సర్వ పాప
క్షయార్ధం, ఉత్తరోత్తరాభి వ్రుద్ధ్యర్ధం మకరంగ
తేరవౌ మహా పవిత్ర గోదావరి మహా పుష్కర స్నానం కరిష్యే.
పై సంకల్పం చెప్పుకొన్న పిదప ఈ క్రింది శ్లోకం చదువు కోవాలి
పిప్పలాదాత్సముత్పన్నే కృత్యే లోకా భయంకరి
మృత్తికాంతే మయాదత్తా మహారార్థం ప్రకల్పయ||
ఈ శ్లోకం చదువుకున్న తరువాత నది వడ్డు నుంచి కొంచం మట్టి తీసి నదిలో వేయాలి. లేకపోతే స్నాన ఫలం
దక్కదని పెద్దలు చెప్తారు.
ఆ తర్వాత స్నానం చేయ వలెను. అనగా తల మునిగేవిధంగా మూడు మునకలు వేయాలి.
నందినీ నళినీ సీతా మాలినీ చ మహాపగా
విష్ణు పాదాబ్జ సంభూతా గంగా త్రిపధ గామినీ
భాగిరధి భొగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ
ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే
స్నాన కాల పఠె న్నిత్యం మహా పాతక నాశనం||
స్నానం తరువాత ప్రార్ధనా శ్లోకాలను చదువుతూ,ప్రవాహానికి ఎదురుగా, వాలుగా, తీరానికి పరాజ్ముఖముగా
కుడి చేతి బొటన వ్రేలుతో నీటిని కదిలించి మూడు దోసిళ్ళనీళ్ళు తీరానికి జల్లి , తీరానికి చేరి బట్టలని పిండుకోవాలి.
తరువాత పొడి బట్టలు కట్టుకొని తమ సంప్రదాయానుసారం విభూతి వంటి వాటిని ధరించి
సంధ్యా వందనాదులు చేసుకోవాలి.తరువాత నదీ తీరాన గాని దేవాలయాన గాని దైవమును
అర్చించాలి.
పుష్కర స్నాన సమయంలో చేయకూడని పనులు
నదిని కలుషితం చేయడం
నదిలో గాని నది గట్టున గాని మల మూత్ర
విసర్జన చేయడం మహా పాపం
ప్లాస్టిక్ సంచులు మరియు వస్తువులు
వాడరాదు. మరీ ముఖ్యంగా నదీ తీరంలో వదిలి
వెళ్ళరాదు.
నదిలో శరీరాన్ని శుభ్ర పరచ రాదు.

No comments:
Post a Comment