Saturday, July 11, 2015

పుష్కర దానములు -1

మహారాష్ట్ర నాసిక్ లో పుట్టి సుమారు 1665 మైళ్ళకు పైబడి ప్రవహీంచి చివరకు తూర్పున బంగాళఖాతంలో సాగర సంగమమవుతుంది. ఈ నది గో కళేబరమును ఆవరించి ప్రవహించినది కావున "గోదావరి" అని పేరు వచ్చినది. బృహస్పతి ప్రతిరాశిలోను ప్రవేశించు ఒక్కో సంవత్సర సమయాన్నిఒక్కొక్క నదికి ఇలా పుష్కర సమయాన్ని బ్రహ్మ నిర్దేశిస్తాడు. 
  • తేది.14-7-2015 నుండి 25-7-2015 వఱకు.
  • పుష్కర కాలము--- 12 రోజులు
  • పుష్కరము అంటె -12 సంవత్సరములు
  • ఈ పుష్కర సమయములో విధిగా దాన ధర్మములు మరియు పితృకార్యక్రమములు చేయవలయును.
  • పుష్కర సమయములో చేయవలసిన దానములు:
  • తేది  -        దైవం పేరు -   దానములు/పూజలు
  • జులై 14  - నారాయణ -   ధాన్యము, రజితము, సువర్ణము
  • జులై 15  -  భాస్కర -      వస్త్రము, లవణము, గోవు, రత్నము.
  • జులై 16  - మహాలక్ష్మి -    బెల్లము, కూరలు, వాహనము
  • జులై 17 -  గణపతి - నేయి, నువ్వులు, తేనె, పాలు, వెన్న
  • జులై 18 -  శ్రీకృష్ణ - ధాన్యము, బండి,గేదె, ఎద్దు, నాగలి
  • జులై 19 -   సరస్వతి - కస్తూరి, గంధపుచెక్క, కర్పూరము.
  • జులై 20-   పార్వతి - గృహము, ఆసనము, శయ్య.
  • జులై 21-   పరమేశ్వరుడు- కందమూలములు, అల్లము, పుష్పమూలము
  • జులై 22-   అనంత - కన్య,పఱుపు,చాప
  • జులై 23-  నరసింహ దుర్గ, లక్ష్మి, దేవి పూజ, సాలగ్రామం
  • జులై 24 -  వామన కంబళి, సరస్వతి , యజ్నోపవీతము, వస్త్రము, తాంబూలము
  • జులై 25-  శ్రీరామ - దశ,షోడశ మహాదానములు

No comments:

Post a Comment