Saturday, July 11, 2015

పర్యావరణ మిత్రులకు పిలుపు!!!!


ఒక్కో షాంపూ పాకెట్టులోని 7.5 మిల్లీ లీటర్ల షాంపూ చొప్పున, 8 కోట్ల స్నానాల వలన 6 లక్షల లీటర్ల నుంచీ 4 లక్షల లీటర్ల షాంపూ నదిలో కలుపుతున్నాము. ఒక్కొక్కరూ 20 గ్రాముల సబ్బు చొప్పున వాడడం వలన 16లక్షల కిలోల సబ్బు గోదావరిలో కలుస్తుంది.
దయచేసి పుష్కర స్నానాలలో షాంపూ, సబ్బులను వినియోగించకుండా యాత్రీకులకు నచ్చచెప్పండి. పుష్కర సమయంలో షాంపూ, సబ్బు వాడకం వలన మన పవిత్ర జలాలను మనమే నాశనం చేసుకుంటున్నామని తెలియచేయండి.
గోదావరి పుష్కరాలలో దాదాపు ఎనిమిది కోట్ల మంది స్నానాలు చేస్తారని ఒక అంచనా. దీనిని బట్టీ లెక్కిస్తే నదిలో కేవలం ఈ 12 రోజులలోనే ఎన్ని లక్షల లీటర్ల హానికరమైన షాంపూ నదిలో కలుపుతున్నామో మీరే గమనించండి.
ఒక్కో షాంపూ పాకెట్టులో 7.5 మిల్లీ లీటర్ల చొప్పున షాంపూ ఉంటుంది. దీన్ని 8 కోట్ల స్నానాలు ( అంటే ఒక్కొక్కరూ రెండు మూడు సార్లు చేసే స్నానాలను సగటున తీసుకోవడం జరిగింది.) వలన 6 లక్షల లీటర్ల నుంచీ 4 లక్షల లీటర్ల షాంపూ నదిలో కలుపుతున్నాము. హానికారకమైన రసాయనాలు ఎన్నింటిని మన చేతులతో నదిలో కలుపుతున్నామో ఒక్కసారి ఆలోచించండి.ఒక్కొక్కరూ 20 గ్రాముల సబ్బు చొప్పున వాడడం వలన 8 కోట్ల మంది సబ్బు వాడితే 16లక్షల కిలోల సబ్బు గోదావరిలో కలుస్తుంది. దీనివలన నీరు ఎంతటి కలుషితం అవుతుందో మీరే గమనించండి.ప్రభుత్వం దీనిని నియంత్రించడం కష్టమైందేమీ కాదు.
ఘాట్ లోకి తీర్ధయాత్రీకులను వదిలేటప్పుడే వారినుంచీ సబ్బు, షాంపూ పేకెట్లు సెక్యూరిటీ పాయింట్ వద్ద సిగరెట్, అగ్గిపెట్టెల మాదిరిగా లాగేసుకోవచ్చు. దీనికి పర్యావరణ మిత్రులు కూడా సహకరించి యాత్రీకులకు నచ్చచెప్పే ప్రయత్నాన్ని స్వచ్ఛంద కార్యకర్తలుగా చేయవచ్చు.

No comments:

Post a Comment