అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం, సమస్త పాప క్షయకరం విష్ణు పాదోదకం పావనం శుభం! అనే మంత్రోచ్చారణతోనే పురోహితులు తీర్థం ఇస్తారు. ఇంతటి పవిత్రమైందే నదీజలం. ఆ జలసంపదలో మునిగి తేలడం అంటే మామూలు కాదు. దానివల్ల ఒరిగే శాస్త్రీయ, ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
_ నదీ జలాలలో అనేక ఔషధీ విశేషాలు ఉంటాయి. కాబట్టి, నదీ జలస్నానం వల్ల మలినాలు పోయి, రక్తశుద్ధి, మంచిబుద్ధి కలుగుతాయి. అయితే, కృష్ణజలం తాగితే క్షాత్రమని, కావేరి నీరు తాగితే గాత్రం, గోదావరి నీరు తాగితే మంచిబుద్ధి కలుగుతాయిని మనవాళ్ళు చెపుతుంటారు.
_ జలాల వల్లే సమస్త ప్రాణులు జీవిస్తాయి. జలంలోనే దేవతలందరు ఉంటారు. జలం సమస్త దేవతా స్వరూపం. ఇలాంటి మహా పవిత్రత కలిగిన నదులు పుష్కర సమయంలో ఇంకా అత్యధికమైన ఫలితాలను ఇస్తాయి.
_ ప్రపంచ శక్తులలో జలమొకటి. జలాన్ని పుష్కరం అంటారు. పోషయ తీతీ పుష్కరం అంటే పోషించేది పుష్కరం అని అర్థం. పోషయత పుష్ణా తీత పుష్కరం అంటే పోషించేది, పుష్టినిచ్చేది పుష్కరం అని కూడా ఇంకో అర్థం.
_ నదీ స్నానం వల్ల జనులకు నాదశక్తి, చైతన్య శక్తి పెరుగుతాయి. ఆ సమయంలో ఆ నదిలో స్నానాదులు చేసిన వారికి ప్రాణ చైతన్యం లభిస్తుంది.
శరీరం మీద ఉండే స్వేద గ్రంథులు రోమాల వల్ల మూసుకుని ఉంటయి. ప్రతి నిత్యం మనం శరీరాన్ని రుద్దుకుని ఆ స్వేద గ్రంథులు పూర్తిగా తెరుచుకోబడవు. ఆ కారణంగా ప్రాచీనులు వైద్య పరమైన ఒక నిర్ణయాన్ని చేస్తూ ప్రతి వ్యక్తి ఏడాదిలో కనీసం నాలుగు సార్లయినా సముద్ర, నదీ స్నానాలు లేదా కనీసం పుష్కర స్నానాలు చేయాలనే నియమాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్నానాలతో శరీరంలో ఉన్న అనవసరం పదార్థం స్వేద రూపంగా బైటికి విసర్జించబడుతుంది.
సంతనా హీనులు సంతాన వంతులు కావడం, కుష్టు, రక్తపోటు, అజీర్ణ వ్యాధులు తొలగడం జరుగుతుందని ప్రసిద్ధి. పుష్కర స్నానంతో దేహమాలిన్యం, మానసిక మాలిన్యాలు పోతాయని కేవలం పురాణాలే కాదు. శాస్త్రీయంగా నిరూపతమైనటువంటి సంగతి.నీళ్లలో అమృతం ఉంది. ఔషధులున్నాయి. ప్రపంచానికి సుఖాన్నిచ్చే అగ్ని (ఉష్ణవ శక్తి రూపేణ) ఉంది. ఇందుకు ఉదాహరణగా ఉత్తరాదిన అందులో ముఖ్యంగా హిమాలయాల్లోని కొన్ని పుణ్యక్షేత్రాల్లో ఉష్ణ నీటి గుంటలున్నాయని, అందులో స్నానాలు చేస్తే కీళ్ళ నొప్పులు వంటి రోగాలు పోతాయని అనుభవం మీద తేలిన సత్యం! సైన్సు కూడా ఒప్పుకుంటున్న నిజం ఇది!
స్నానాలు వివిధ రకాలు. అన్నింటికన్నా సముద్ర స్నానం అత్యుత్తమమని చెబుతారు. శాస్ర్తాలు కూడా ఉప్పు నీటిలో స్నానం చేయడం వల్ల మలినాలు బయటకు పోవడమే గాక శరీర వర్చస్సు కూడా పెరుగుతుందని చెబుతాయి. రెండోది నది స్నానం. నదీ స్నానం విశిష్టతను గురించి ప్రాచీన గ్రంథాలు విరివిగా చెప్పాయి.
పొద్దున్నే లేచి నదిలో స్నానం చేస్తే చర్మ రోగాలు దరిచేరవని, రక్త ప్రసారం చక్కగా జరుగుతుందని, నదీ జలాలు కొండలు, కోనలు, అడవుల గుండా ప్రవహిస్తూ వస్తాయి. కాబట్టి, ఆ నీటిలోని ఔషధ గుణాలు మనకు మేలు చేస్తాయని చెబుతారు.
స్నానానికి, భౌతిక శాస్త్ర సంబంధమైన విద్యుదయస్కాంత ప్రేరణ (ఎలక్ట్రోమాగ్నెటిజం) సిద్ధాంతానికీ సంబంధం ఉందని నిపుణులు అంటారు. నీటికి గల అత్యద్భుత గుణం వైజ్ఞానిక ప్రయోగాల ద్వారానూ రుజువైంది. అసలు మానవుని దేహమే ఓ విద్యుచ్ఛక్తి కేంద్రం. ఎప్పుడూ ఈ దేహంలోంచి విద్యుత్తు ఉత్పాదనా, విసర్జనా జరుగుతూనే ఉంటుంది. ఇలా అనేక రకాలుగా నదీజలాలు మానవాళికి ఆరోగ్యదాయిని అవుతున్నాయి. మరి, ఇది పుష్కర సమయం కాబట్టి, అటు పుణ్యానికి పుణ్యం, ఇటు పురుషార్థానికి పురుషార్థం.
No comments:
Post a Comment