Saturday, July 11, 2015

గోదావరి పుష్కరాలు 2015

గోదావరి పుష్కరాలు జూలై 14 న మొదలై జూలై 25తో ముగుస్తాయి. జూలై 14వ తేదీ ఉదయం 6.26 గంటలకు గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి. అయితే ఈ పుష్కరాల పన్నెండు రోజులు స్నానం, దానం, తర్పణం అత్యంత ప్రాధాన్యమైనవి. దేశంలో జరిగే 12 నదుల పుష్కరాలలో గోదావరి నదీ పుష్కరం ఒకటి. బృహస్పతీ సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి పుష్కరాలు నిర్వహిస్తారు. ఇది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈసారి ఈ పుష్కరాలను మహాపుష్కరంగా పిలుస్తున్నారు. పన్నెండు సంవత్సరాలకు వచ్చేది పుష్కరమైతే.. పన్నెండు పుష్కరాలకు వచ్చేది మహాపుష్కరం. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద త్రయంబకంలో పుట్టి అక్కడినుంచి తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం మీదుగా ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించి చివరగా అంతర్వేదివద్ద బంగాళాఖాతంలో కలుస్తోందీ గోదావరి. 

No comments:

Post a Comment